కరోనాను లైట్ తీసుకుంటున్న ప్రజలు.. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు

కరోనాను లైట్ తీసుకుంటున్న ప్రజలు.. దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు
దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇంకా మహమ్మారి మనమధ్యలోనే ఉన్నా.. ప్రజలు మాత్రం వైరస్‌ను లైట్ తీసుకుంటున్నారు.

దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. ఇంకా మహమ్మారి మనమధ్యలోనే ఉన్నా.. ప్రజలు మాత్రం వైరస్‌ను లైట్ తీసుకుంటున్నారు. నిబంధనలు, జాగ్రత్తలు గాలికి వదిలేయడంతో కొత్త కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా వైరస్‌లో ఎటువంటి మార్పు రాలేదు.. పైగా కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. గతేడాది కంటే ఇప్పుడు కేసుల సంఖ్య నాలుగింతలు రెట్టింపు అయింది. గత 20 రోజుల క్రితం వరకు 20 నుంచి 30వేల లోపు నమోదైన కేసులు.. ఇప్పుడు ఏకంగా లక్షన్నర దాటింది. అయినా ప్రజలు నిర్లక్ష్యంగానే ఉన్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సెకండ్ వేవ్ దెబ్బకి ఇప్పటికే పలు నగరాల్లో లాక్‌డౌన్‌లు ప్రకటించారు. మరికొన్ని చోట్ల నైట్ కర్ఫ్యూ అమల్లోకి తెచ్చారు. స్కూళ్లు, కాలేజీలు సైతం మూసివేశారు. అయినా కేసులు ఏమాత్రం తగ్గడం లేదు. ఒక్క రాష్ట్రమని కాదు.. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ముఖ్యంగా కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని నిపుణులు చెబుతున్నారు.

గతంలో కరోనా కేసులు వస్తే.. ఆ ప్రాంతాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించి.. కఠిన చర్యలతో కరోనాను కట్టడి చేసేవారు. కానీ ఇప్పుడు అలా జరగడం లేదు. పైగా లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ వస్తోంది. దీంతో బాధితులు తెలియకుండానే ఇతరులకు వైరస్ అంటిస్తున్నారు. మరీ ముఖ్యంగా భౌతికదూరం, మాస్కులు, శానిటైజర్లు ప్రజలు మర్చిపోయారు. గతంలో ఏది ముట్టుకోవాలన్నా ఒకటికి రెండు సార్లు శానిటైజ్ చేసేవాళ్లు.. ఇప్పుడా భయం కనిపించడం లేదు. మనకి రాదులే అన్న ధీమాలో ప్రజలు ఉండటంతో వైరస్ వ్యాప్తి అధికమవుతోంది.

మరోవైపు లాక్‌డౌన్‌లు, నైట్‌ కర్ఫ్యూలతో ప్రజలను కొంతవరకు కట్టడి చేసినా.. మరిన్ని ఆంక్షలు అమలు చేయాలని నిపుణులు సూచిస్తుననారు. కేవలం వాటికే పరిమితం కాకుండా ప్రజలు కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాలించేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ప్రజల సహకారం లేనిదే వైరస్‌ను కట్టడి చేయలేమంటున్నారు. గతంలో కరోనా కేసులు వస్తే కంటైన్‌మెంట్ జోన్లు, మైక్రో కంటైన్‌మెంట్ జోన్లుగా విభజించి కరోనాని కట్టడి చేసేవారు. ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేసి.. ప్రజలను అప్రమత్తం చేసేవారు. ఒకరికి పాజిటివ్ వస్తే.. అతనితో కాంటాక్ట్ అయిన వారిని ట్రేస్ చేసి వారికి పరీక్షలు చేసేవారు. ఇలా కరోనాను కంట్రోల్‌లోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరికి కరోనా ఉందో.. ఎవరికి లేదో తెలియని పరిస్థితి లేదని నిపుణులు చెబుతున్నారు.

తెలుగురాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ముఖ్యంగా రద్దీ ప్రదేశాల్లో ప్రజలు మాస్కులు ధరించడం లేదు. ప్రభుత్వాలు జరిమానా విధిస్తామన్న లెక్క చేయడం లేదు. కరోనా తమనేం చేస్తుందిలే అని ధీమాగా ఉన్నారు. మాస్కులు, భౌతికదూరం పాటించాలని అధికారులు మొత్తుకున్నా అవేమి పట్టనట్లు వ్యవహిరిస్తున్నారు. మరోవైపు అధికారులు సైతం చూసిచూడనట్లు వ్యవహరించడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. గతంలో వ్యవహించిన స్ఫూర్తిని ఇప్పుడు కూడా ప్రదర్శిస్తే కరోనా వైరస్‌ను కట్టడి చేయొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story