Foreign Vaccine : విదేశీ వ్యాక్సిన్ వాడకం పై కేంద్రం ఫోకస్..!

Foreign Vaccine : విదేశీ వ్యాక్సిన్ వాడకం పై కేంద్రం ఫోకస్..!
Foreign Vaccine : దేశీయ టీకాలనే వాడతామని ఇన్నిరోజులు మడికట్టుకొని కూర్చున్న కేంద్ర ప్రభుత్వం.. కరోనా సెకండ్ వేవ్ ఉధృతితో పునరాలోచనలో పడింది.

దేశీయ టీకాలనే వాడతామని ఇన్నిరోజులు మడికట్టుకొని కూర్చున్న కేంద్ర ప్రభుత్వం.. కరోనా సెకండ్ వేవ్ ఉధృతితో పునరాలోచనలో పడింది. విదేశీ వ్యాక్సిన్ లకి దిగుమతులకు సన్నాహాలు చేస్తుంది అమెరికాకు చెందిన వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. దేశంలో టీకాల కొరత అధికంగా ఉండడంతో మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.

అమెరికాలో ఇప్పటికే ఆమోదం పొందిన వ్యాక్సిన్లను కూడా దేశంలో అనుమతి ఇవ్వలేదు. ఇక్కడ ట్రైల్స్ నిర్వహించాలని మెలిక పెట్టాయి. కానీ ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ తో అందరి ప్రాణాలకు ఎసరు వచ్చింది. దీనితోపాటు దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తి స్వల్పంగా ఉండడంతో అందరికీ అందించలేకపోతున్నాయి. పైగా కరోనా సెకండ్ వేవ్ తో చాలామంది రోగులు ఆసుపత్రి పాలై ఆక్సిజన్ అందక చనిపోతున్న పరిస్థితులు దాపురించాయి.

ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అనుమతి పొందిన ఏ టీకా అయినా దిగుమతి చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది.. వీటికి ఒకటి రెండు రోజుల్లోనే అనుమతి ఇస్తామని తెలిపింది. వ్యాక్సిన్ ల దిగుమతి కోసం ఇప్పటివరకు ఎలాంటి దరఖాస్తులు పెండింగ్ లేదని కేంద్రం స్పష్టం చేసింది.

ఇక ఇదే కాదు రష్యా అభివృద్ధి చేసిన టీకాకి భారత్ ఆమోదం తెలిపింది. వచ్చేవారం నుండి రష్యా టీకాను భారతీయ మార్కెట్ లోకి అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. రెడ్డీస్ ల్యాబ్ సంస్థ భారత్ లో ఈ టీకాల పంపిణీని చేపట్టనుంది. మొత్తంగా టీకాల కొరతతో అల్లాడుతున్న దేశ ప్రజలకి ఊరట ఇచ్చేలా అన్ని వ్యాక్సిన్లకు ఆమోదం ఇచ్చిన మోదీ సర్కార్ ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకుందని అందరి నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి.

ఇప్పటికైనా రాబోయే ఆరు నెలల్లోనే దేశ ప్రజలందరికీ టీకాలు వేస్తే ఈ కరోనా ని తరిమి కొట్టవచ్చునని, మూడో వేవ్ ను అడ్డుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.



Tags

Read MoreRead Less
Next Story