Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీకి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ

Narendra Modi : దేశప్రధాని నరేంద్రమోదీకిపై ప్రజల్లో ఆధరణ పెరుగుతుందా..? మోదీపై జనాల్లో నమ్మకం ఇంకా బలంగానే ఉందా..? మోదీ పాలనను సమర్ధించేవారు ఎక్కువగానే ఉన్నారా.?? అంటే అవుననే అంటున్నాయి సర్వేలు. ప్రధాని మోదీ సర్కారు పాలనను సమర్ధించేవారు 67శాతం ఉన్నట్లు ఓ సర్వేలో తేలింది. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి పలు సమస్యలు ఉన్నప్పటికీ... మోదీ సర్కారు పాలనను చాలామందే సమర్థిస్తున్నట్లు వెల్లడైంది. ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు, నిరుద్యోగం వంటి పరిస్థితులు ఆందోళనకు గురిచేస్తున్నా.. ప్రజలు మాత్రం ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వంపై నమ్మకంగా ఉన్నట్లు వెల్లడైంది. అందుకే ఆయన పాలనను 67 శాతం మంది ఆమోదించారు.
అయితే కరోనా మహమ్మారి ప్రారంభం నుంచి ఈ ప్రజామోద రేటింగ్ అధికస్థాయికి చేరింది. కొవిడ్ ప్రారంభ రెండు సంవత్సరాలక్రితంలో ఈ రేటింగ్ 62 శాతంగా ఉండగా.. రెండో వేవ్ చూపిన ఉద్ధృతికి అది కాస్తా 51 శాతానికి పడిపోయింది. ఆ తర్వాత కొవిడ్ టీకా పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయడం, మూడోవేవ్ సమర్థవంతంగా ఎదుర్కోవడంతో.. ఇప్పుడా రేటింగ్ 67 శాతానికి పెరిగింది. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఈ సర్వేలో 67 వేల మంది పాల్గొన్నట్లు తెలిపింది. దేశం క్లిస్టసమయంలోనే మోదీ రేటింగ్ పెరుగడం విశేషం.
ఇక, ఈ ఏడాది మొదటి నుంచి నిరుద్యోగం ఏడు శాతానికి దగ్గరగా ఉండటంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సర్వేలో పాల్గొన్న 47 శాతం మంది ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయిందని చెప్పారు. అయితే 37 శాతం మంది మోదీ పాలన నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గత మూడు సంవత్సరాలుగా నిత్యావసరాల ధరలు, ఖర్చులు తగ్గడం లేదని 73 శాతం మంది వెల్లడించడం గమనార్హం. పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, 2024లో సార్వత్రిక ఎన్నికలు ఉన్నవేళ.. బీజేపీ ఇది ప్రతికూలాంశంగా కనిపిస్తుంది. ఇక 73 శాతం మంది తమ భవిష్యత్తుపై సానుకూలంగా ఉండగా.. 50 శాతం మంది మన దేశంలో వ్యాపారం చేయడం సులభతరంగా మారిందని చెప్పారు. మత సామరస్యాన్ని మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం తగిన కృషి చేస్తోందని 60 శాతం అభిప్రాయపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com