శశికళ ఎంట్రీతో రసవత్తరంగా తమిళనాడు రాజకీయాలు

తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు ఆమె స్నేహితురాలు శశికళ నివాళులర్పించారు. జయలలిత 73వ జయంతి సందర్భంగా టి.నగర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా జయలలిత అభిమానులను ఉద్దేశించి శశికళ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో జయలలిత అనుచరులంతా డీఎంకేకు వ్యతిరేకంగా సంఘటితం కావాలని అన్నారు. డీఎంకే పార్టీయే తమందరికీ ఉమ్మడి శత్రువన్న శశికళ.. ఆ పార్టీకి వ్యతిరేకంగా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.
జయలలిత నేతృత్వంలో ఏర్పాటయి కొనసాగుతున్న ప్రభుత్వాన్ని మరో వందేళ్ల పాటు కొనసాగించేలా పనిచేయడమే మన ముందున్న లక్ష్యమని వ్యాఖ్యానించారు. జైలు నుంచి విడుదలకు ముందు కరోనా బారిన పడిన తాను త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాట జయ ప్రభుత్వం కొనసాగేలా శ్రేణులంతా కృషిచేయాలని కోరారు. రాష్ట్రంలోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని అమ్మ ప్రభుత్వంగా శశికళ పేర్కొనడంపై రాజకీయ నేతలు ఉత్కంఠగా భావిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com