Prashant Kishor : సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెడుతున్న పీకే?

Prashant Kishor :  సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెడుతున్న పీకే?
Prashant Kishor : ప్రశాంత్ కిషోర్ సంచలనం ప్రకటన చేయబోతున్నారా? సొంతంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారా?

Prashant Kishor : ప్రశాంత్ కిషోర్ సంచలనం ప్రకటన చేయబోతున్నారా? సొంతంగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నారా? ఇవాళ ప్రశాంత్‌ కిశోర్‌ కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటూ పొలిటికల్ సర్కిల్‌లో ఓ వార్త వైరల్ అవుతోంది. నేషనల్ మీడియాలోనూ పీకే పార్టీలో పలు కథనాలు వస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సొంతగా రాజకీయ పార్టీ పెడుతున్నారని, ఇవాళే దీనిపై ప్రకటన చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.

మొన్నటి వరకు ఢిల్లీలోనే ఉన్న పీకే.. పార్టీ ప్రకటన కోసం సొంత రాష్ట్రమైన బీహార్‌ చేరుకున్నారని, పాట్నాలో ఇవాళ ప్రెస్‌మీట్‌ పెడతారనే ప్రచారం జరుగుతోంది. సొంతంగా పార్టీ పెట్టడమే కాదు.. తనతో కలిసి వచ్చే పార్టీలతోనూ కలిసి నడిచేలా ప్రశాంత్‌ కిషోర్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈమధ్య వివిధ పార్టీల నేతలతోనూ చర్చలు జరిపారు. ఒకవేళ ఇవాళ పార్టీ ప్రకటన చేస్తే.. దేశంలోని వివిధ పార్టీలను కలుపుకొని వెళ్లే విషయంపైనా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

తాను వేరు, ఐప్యాక్‌ వేరు అంటూ ఈమధ్య కొత్త వర్షన్‌ వినిపిస్తున్నారు ప్రశాంత్ కిషోర్. తాను కాంగ్రెస్‌లో చేరినా.. ఐప్యాక్‌ తన పని తాను చేసుకుపోతుందని మొన్నామధ్య స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఇకపై ఎన్నికల వ్యూహకర్తగా ఉండబోనని గతంలో చెప్పేశారు. బెంగాల్‌లో మమత బెనర్జీని గెలిపించిన తరువాత వ్యూహకర్త వృత్తిని వదిలేస్తున్నట్టు ప్రకటించారు. కొన్నేళ్ల క్రితం జేడీయూలో చేరి బయటికొచ్చేయడం, కాంగ్రెస్‌ పార్టీలో చేరాలనే ప్రయత్నం చేయడం.. ఇవన్నీ ఒకే సిగ్నల్‌ ఇస్తున్నాయంటున్నారు పీకే సన్నిహితులు. ఇకపై వ్యూహకర్తగా ఉండడం కంటే.. ఏదైనా రాజకీయ పార్టీలో కీరోల్‌ పోషించాలనే భావనలో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే, ఆ ప్రయత్నాలేవీ వర్కౌట్‌ అవకపోవడంతో.. ఏకంగా కొత్త పార్టీ ఆలోచన చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ప్రశాంత్ కిషోర్ నిర్వహిస్తున్న ఐప్యాక్‌ సంస్థకు దేశవ్యాప్తంగా వాలంటీర్లు, ఉద్యోగులు ఉన్నారు. ఇప్పటికే, ఈ సంస్థ ద్వారా యువత రాజకీయాల్లోకి రావాలనే నినాదాన్ని చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల్లో డ్రైవ్ నిర్వహిస్తూ.. యువత నుంచి పెద్ద ఎత్తున పేర్ల నమోదు కూడా జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా పీకే సొంత రాష్ట్రమైన బీహార్‌లో గ్రామ స్థాయి నుంచి యువతతో కమిటీలు ఏర్పాటు చేశారనే ప్రచారం జరుగుతోంది.

ప్రశాంత్‌ కిషోర్‌కు రాజకీయ అనుభవం లేకపోయినా.. రాజకీయాలపై బాగా అవగాహన ఉంది. ఎవరిని ఫేమస్ చేయాలి, ఎలా డీఫేమ్‌ చేయాలన్న స్ట్రాటజీలో ఆరితేరారని రాజకీయ నేతలే చెబుతున్నారు. 2014లో మోదీని హీరోను చేస్తూ క్యాంపైన్ చేశారు. రాహుల్‌గాంధీ స్థాయి తగ్గించేలా వ్యూహాలు పన్నారు. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి పీకే చాలా కష్టపడ్డారు. ఆ తరువాత 2017లో పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి పనిచేశారు. 2019లో వైసీపీని అధికారంలోకి తెచ్చారు. 2020లో ఆమ్‌ఆద్మీ పార్టీ సైతం పీకే మద్దతు తీసుకుంది. ఆ తరువాత బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ను గెలిపించారు. సో, పొలిటికల్‌ స్ట్రాటజిస్ట్‌గా తనకున్న పేరు, అనుభవంతోనే కొత్తగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలొస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story