ఆందోళనకరంగా ప్రణబ్ ఆరోగ్యం

ఆందోళనకరంగా ప్రణబ్ ఆరోగ్యం
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై ఆర్మీ ఆస్పత్రి ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై ఆర్మీ ఆస్పత్రి ఆదివారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆయన పరిస్తితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. తీవ్రమైన కోమాలో ఉన్నారని.. వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్నారని ప్రకటించారు. ప్రస్తుతం ఆయన శరీరంలో రక్తం సరఫరా బాగా జరుగుతున్నప్పటికీ.. ఇంకా కోమాలోనే ఉన్నారని తెలిపారు. కాగా.. ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్థారణ కావటంతో ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. అనంతరం ఆయనకు ఆగస్టు 10న బ్రెయిన్ సర్జరీ జరిగింది.

Tags

Next Story