జాతీయం

కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌.. !

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రరూపంలో వ్యాపిస్తోంది.. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో ఉండడం లేదు.

కరోనా కల్లోలం: 14 రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌.. !
X

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్రరూపంలో వ్యాపిస్తోంది.. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఫలితం మాత్రం ఆశించిన స్థాయిలో ఉండడం లేదు. దీంతో విధిలేక చివరి అస్త్రంగా అన్నీ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏకంగా 14 రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. మహారాష్ట్రతో మొదలైన లాక్‌డౌన్‌... ఆ తరవాత ఢిల్లీ,కర్ణాటక నుంచి రాష్ట్రాలు లాక్‌డౌన్‌ వైపు మొగ్గు చూపాయి. తాజాగా రాజస్తాన్, తమిళనాడు రాష్ట్రాలు లాక్ డౌన్ విధించాయి.

కేరళ: ఈనెల 16వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌

ఢిల్లీ: 10వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. పొడగించే అవకాశం ఉంది.

మధ్యప్రదేశ్‌: ఈనెల 15 వరకు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ అమల్లో ఉంది.

ఉత్తరప్రదేశ్‌: ఈనెల 10 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉండనుంది.

హిమాచల్‌ప్రదేశ్‌: ఈనెల 16 వరకు కొనసాగనున్న లాక్‌డౌన్‌.

తమిళనాడు: మే 10 నుంచి 24వ తేదీ వరకు లాక్‌డౌన్‌

కర్ణాటక: ఈనెల 10 నుంచి 24వ తేదీ వరకు సంపూర్ణ లాక్‌డౌన్‌

రాజస్థాన్‌: ఈనెల 10 నుంచి 24 వరకు లాక్‌డౌన్‌

మహారాష్ట్ర: ఏప్రిల్‌ 5న కర్ఫ్యూ లాంటి లాక్‌డౌన్, నిషేధ ఉత్తర్వులతో ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. నిషేదాజ్ఞలు మే 15 వరకు పొడిగించారు.

బిహార్‌: మే 4 నుంచి 15 వరకు లాక్‌డౌన్‌

చండీగఢ్‌: వారం రోజుల లాక్‌ డౌన్‌

గోవా: మే 9 నుంచి 23 వరకు..

హరియాణా: మే 3 నుంచి మొత్తం వారం రోజుల పాటు 10వ తేదీ వరకు.

మణిపూర్: మే 7 వరకు లాక్డౌన్

Next Story

RELATED STORIES