Project Cheetah: భారత్‌కు రానున్న 12 చీతాలు

Project Cheetah: భారత్‌కు రానున్న 12 చీతాలు
X
దక్షిణాఫ్రికాతో ఒప్పందంలో భాగంగా తొలి దశలో భారత్‌కు 12 చీతాలు

భారత్‌కు మరిన్ని చీతాలు రానున్నాయి. ఇప్పటికే నమీబియా నుంచి 8 చీతాలను తీసుకొచ్చిన భారత ప్రభుత్వం మధ్యప్రదేశ్‌లోని కూనో పార్క్‌లో వదిలారు. తాజాగా దక్షిణాఫ్రికా నుంచి ఈ నెల 18న మరో 12 చీతాలు భారత్‌కు రానున్నాయి. దక్షిణాఫ్రికాతో ఒప్పందంలో భాగంగా తొలి దశలో భారత్‌కు 12 చీతాలను తీసుకొస్తున్నట్లు అధికారులు తెలిపారు. తొలుత ఇవి వాయుమార్గం ద్వారా గ్వాలియర్‌కు చేరుకుంటాయి. అక్కడి నుంచి కూనో పార్క్‌కు తరలిస్తారు. ఇక నిబంధనల ప్రకారం వాటిని ఒక నెల క్వారంటైన్‌లో ఉంచుతారు. అనంతరం పార్క్‌లోకి వదలనున్నారు.

Tags

Next Story