నిరూపిస్తే 100 గుంజీళ్లు తీస్తా: మమతా బెనర్జీ

ఈ ఏడాది దుర్గా పూజలు ఉండవని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చెప్పిందని పుకార్లు వ్యాపిస్తున్నాయి. అందులో ఎంత మాత్రం నిజంలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుతం ఉన్న కోవిడ్ -19 లాక్‌డౌన్ చర్యలను సెప్టెంబర్ 20 వరకు పొడిగించారు. దుర్గా పూజలు ఉండవని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చెప్పిందని నిరూపించగలిగితే, తాను ప్రజల ముందు 100 సిట్-అప్‌లు చేస్తానని అన్నారు.
"ఒక రాజకీయ పార్టీ దుర్గా పూజ గురించి దుర్మార్గపు పుకార్లు వ్యాప్తి చేస్తోంది, ఇప్పటివరకు మేము దానిపై ఇంకా సమావేశం కూడా నిర్వహించలేదు అని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చెప్పారు. "దుర్గా పూజపై సోషల్ మీడియా అసత్యపు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆమె అన్నారు. ఉద్దేశపూర్వకంగా నకిలీ వార్తలను వ్యాప్తి చేసే వారిని గుర్తించమని నేను పోలీసులను అడుగుతున్నాను. మత సామరస్యాన్ని కాపాడాలనే తమ ప్రయత్నాన్ని ఈ నకిలీ వార్తలు నాశనం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శివుడు, దుర్గ, హనుమంతులను ఎప్పుడూ పూజించని వారు కూడా పూజ గురించి మాట్లాడుతున్నారు అని మమత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com