జాక్‌పాట్ కొట్టేసింది.. వంద పెట్టి కోటి గెలిచింది..!

అదృష్టం ఎవరిని, ఎప్పుడు, ఎలా వరిస్తుందో ఎవరికీ తెలియదు. ఆ అదృష్టంతో అప్పటివరకు పేదవాళ్ళుగా ఉన్నవారు కూడా ఒక్కసారిగా కోటీశ్వరులు కావచ్చు... తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. వంద రూపాయలు ఖర్చు పెట్టి లాటరీ టికెట్ కొన్న ఓ మహిళ ఏకంగా కోటి రూపాయలు సొంతం చేసుకుంది. ఈ సంఘటన అమృత్‌సర్ లో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అమృత్‌సర్‌కు చెందిన రేణు చౌహాన్ గర్భిణి. భార్యాభర్తలు ఇద్దరూ వస్త్ర వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
అయితే ఇటీవల రేణు రూ.100 పెట్టి లాటరీలో డీ-12228 టికెట్ కొనుకుంది. ఆ లాటరీకి సంబంధించిన డ్రాని ఫిబ్రవరి 11వ తేదీన తీశారు. అందులో రేణు కొనుగోలు చేసిన టికెట్‌కు లాటరీ తగిలింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రేను కుటుంబానికి అవధులు లేవనే చెప్పాలి. దీనికి సంబంధించిన అవసరమైన పత్రాలు సమర్పించాలని లాటరీస్ శాఖ అధికారులు రేణుకి సమాచారం అందించారు.
తాజాగా ఆమె సంబంధిత అధికారాలుకి ఆ పత్రాలని అందజేశారు. ఆమె బ్యాంక్ ఖాతాలోకి త్వరలోనే నగదు జమ చేస్తామని అధికారులు వెల్లడించారు. ఈ డబ్బుతో తమ కష్టాలన్నీ తీరిపోయాయని రేణు దంపతులు హర్షం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com