జల్లికట్టులో రాహుల్ గాంధీ సందడి.. బీజేపీ చీఫ్ కూడా

జల్లికట్టులో రాహుల్ గాంధీ సందడి.. బీజేపీ చీఫ్ కూడా
పొంగల్ నాడు తమిళులు. జల్లికట్టు జరుపుకోవడం సంప్రదాయం. అయితే ఈ సారి మాత్రం జాతీయ నాయకులు పొలిటికల్‌ జల్లికట్టు జరుపుకుంటున్నారు.

పొంగల్ నాడు తమిళులు. జల్లికట్టు జరుపుకోవడం సంప్రదాయం. అయితే ఈ సారి మాత్రం జాతీయ నాయకులు పొలిటికల్‌ జల్లికట్టు జరుపుకుంటున్నారు. RSS చీఫ్‌ మోహన్ రావ్ భాగవత్, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ముగ్గురూ తమిళనాడులో పర్యటిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో జల్లికట్టుని రాజకీయ క్రీడగా మార్చేసుకుంటున్నాయి పార్టీలు. తమిళులను ప్రసన్నం చేసుకునేందుకు జల్లికట్టు సెంటిమెంట్‌ను పండిస్తూ ఏకంగా ప్రధాన పార్టీల కీలక నేతలు రంగంలో దిగడం విశేషం. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ మధురై జిల్లా అవనియాపురంలో జల్లికట్టును వీక్షించారు.

ఇక బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం తమిళనాడులో పర్యటిస్తున్నారు. పొంగల్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం బీజేపీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశాయి రాష్ట్ర్ బీజేపీ శ్రేణులు. మరోవైపు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ సైతం చైన్నైలో పర్యటిస్తున్నారు. కదంబుడీ చిన్నమ్మన్ ఆలయంలో గోపూజలో పాల్గొని పొంగల్ ఉత్సవాలను ప్రారంభించారు. ఆయన చెన్నై పర్యటన రెండ్రోజుల పాటు జరగనుంది. ఈ పర్యటనలో ప్రముఖులు, యువ పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు మోహన్‌భాగవత్‌.

Tags

Next Story