కరోనా నియంత్రణలో మోదీ పూర్తిగా విఫలం : రాహుల్‌ గాంధీ

కరోనా నియంత్రణలో మోదీ పూర్తిగా విఫలం :  రాహుల్‌ గాంధీ
దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

దేశవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కరోనా నియంత్రణలో మోదీ సర్కార్‌ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేంద్రం చేపట్టిన చర్యలేవీ కరోనాను నియంత్రించలేకపోయాయని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ చేతగానితనం వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు. ఇక మహమ్మారి కట్టడి ఇప్పుడు ఉన్న ఏకైక మార్గం లాక్‌డౌన్‌ ఒక్కటేనన్నారు రాహుల్‌ గాంధీ.

కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలంటే సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలన్నారు. ప్రభావిత వర్గాలకు రక్షణ కల్పిస్తూ లాక్‌డౌన్ అమలు చేయాలని కేంద్రానికి సూచించారు. ప్రభుత్వం చేతగానితనం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని.... ఇది ప్రభుత్వానికి అర్థం కావడం లేదా అని ప్రశ్నించారు. కరోనా కట్టడికి ఎలాంటి వ్యూహం లేనందున ఇక లాక్‌డౌన్ అనే ప్రత్యామ్నాయం ఒక్కటే మిగిలిందన్నారు.

ఇదిలా ఉంటే రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడింది. మహమ్మారి పేరుతో నీచ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ ఐటీ ఇన్‌ఛార్జి విమర్శించారు. ఈ విషయం రాహుల్‌కు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. తాజా వ్యాఖ్యలు రాహుల్‌ దిగజారుడుతననానికి నిదర్శనమని దుయ్యబట్టారు.

Tags

Read MoreRead Less
Next Story