జాతీయం

ప్రధాని మోదీకి తమిళ సంస్కృతిపై గౌరవం లేదని రాహుల్ ఫైర్‌

కోయంబత్తూర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్.. మోదీపై విరుచుకుపడ్డారు.

ప్రధాని మోదీకి తమిళ సంస్కృతిపై గౌరవం లేదని రాహుల్ ఫైర్‌
X

ప్రధాని మోదీకి తమిళ సంస్కృతిపై గౌరవం లేదంటూ.. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్... మోదీపై విరుచుకుపడ్డారు.

తమిళనాడులోని తిరుప్పూర్‌, ఈరోడ్‌, కరూర్‌ జిల్లాలో మూడు రోజులపాటు రాహుల్‌ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ పలు రోడ్‌ షోల్లో పాల్గొనడంతోపాటు.. ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు, రైతులతో మాట్లాడుతారు.

అయితే... AIDMKకు గట్టి పట్టు ఉన్న ఈ మూడు జిల్లాల్లో రాహుల్ పర్యటన సాగడం విశేషం. స్థానిక అభ్యర్థి తరపున.. కోయంబత్తూర్‌లోని రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. భారత్‌లోని విభిన్న సంస్కృతులను, భాషలను కాంగ్రెస్ గౌరవిస్తోందన్నారు.


Next Story

RELATED STORIES