Rajasthan Bus Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. పలువురు సజీవ దహనం..

X
By - Divya Reddy |10 Nov 2021 12:47 PM IST
Rajasthan Bus Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Rajasthan Bus Accident: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్, బస్సు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. దీంతో పలువురు సజీవదహనమైనట్లు తెలుస్తోంది. మరికొందరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఫైరింజన్లు మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు.
కనీసం 12 మంది ఈ ఘటనలో చనిపోయినట్టు అనుమానిస్తున్నారు. 10 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 25 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com