Republic Day 2022 : దేశవ్యాప్తంగా ఘనంగా 73వ గణతంత్ర వేడుకలు

Republic Day 2022 : దేశవ్యాప్తంగా ఘనంగా 73వ గణతంత్ర వేడుకలు
Republic Day 2022: దేశ 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Republic Day 2022: దేశ 73వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా గేట్‌ వద్ద ఉన్న నేషనల్ వార్ మెమోరియల్‌కి వెళ్లి అమరవీరులకు నివాళులు అర్పించారు. మరికాసేపట్లో రాజ్‌పథ్‌లో జరిగే పెరేడ్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పాల్గొంటారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈసారి పొగమంచు కారణంగా శకటాల ప్రదర్శన ఆలస్యంగా మొదలు కానుంది. ఉదయం 10 దాటిన తర్వాతే ఆ ర్యాలీ ప్రారంభం అవుతుంది. విజయ్‌చౌక్‌ నుంచి నేషనల్ స్టేడియం వరకూ రాజ్‌పథ్‌లో సాగే పెరేడ్‌లో మన ఆయుధ సంపత్తిని చాటి చెప్పేలా ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల కవాతు జరగనుంది.

Tags

Next Story