Home
 / 
జాతీయం / ఛత్తీస్‌గఢ్‌లో ఘోర...

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
X

ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం కూలీలతో ఒడిశా నుంచి గుజరాత్ వెళ్తున్న బస్సు చెరీఖడీ దగ్గర ఓ ట్రక్కును ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో అక్కడికక్కడే ఏడుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఇంకా మృతులను ఇంకా గుర్తించలేదని.. త్వరలోనే వారి వివరాలు వెల్లడిస్తామని అన్నారు.

Next Story