Goa-Mumbai Highway: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా 9మంది మృతి

Goa-Mumbai Highway: ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా 9మంది మృతి
Goa-Mumbai Highway: గోవా-ముంబై హైవేపై ట్రక్కును కారు ఢీకొనడంతో ఒక చిన్నారితో సహా 9 మంది మృతి చెందారు.

Goa-Mumbai Highway: గోవా-ముంబై హైవేపై ట్రక్కును కారు ఢీకొనడంతో ఒక చిన్నారితో సహా 9 మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో మాంగావ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
గురువారం ఉదయం ముంబై-గోవా హైవేపై కారు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 9 మంది మృతి చెందారు. మృతుల్లో అయిదుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారు. రాయ్‌గఢ్ జిల్లాలోని రెపోలి ప్రాంతంలో గోవా-ముంబై హైవేపై ఈ ఘటన చోటుచేసుకుంది.ట్రక్కు ముంబైకి వెళ్తుండగా, కారు రత్నగిరి జిల్లాలోని గుహగర్‌కు వెళుతోంది. ఘోర ప్రమాదం తర్వాత కారు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదం ఎంత తీవ్రస్థాయిలో ఉందో కారు నుజ్జు నుజ్జు అయిన ఫోటోలు తెలుపుతున్నాయి. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

Tags

Next Story