ఘోర రోడ్డుప్రమాదం.. గర్బిణీ సహా ఏడుగురు మృతి

ఘోర రోడ్డుప్రమాదం.. గర్బిణీ సహా ఏడుగురు మృతి
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి ట్రక్కును ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కలబురిగి జిల్లాలో సవలగి గ్రామ శివార్లులో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. అయితే, మృతుల్లో ఒక గర్భిణీ కూడా ఉండటంతో కుటుంబ సభ్యులు సహా కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారంతా అలండ్ పట్టణానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. గర్భిణీని ప్రసవం కోసం కలబురిగికి తీసుకువస్తుండగా ప్రమాదానికి గురయ్యారని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story