Sheetal Nath Temple: శ్రీనగర్‌లో 31 ఏళ్ల తర్వాత తెరుచుకున్న శీతల్‌నాథ్ ఆలయం

Sheetal Nath Temple
Sheetal Nath Temple : ఉగ్రవాదుల ప్రాబల్యంతో శ్రీనగర్‌లో మూతపడిన శీతల్‌నాథ్ దేవాలయం 31 ఏళ్ల తర్వాత తెరుచుకుంది. శ్రీనగర్ హబ్బా కదల్ ప్రాంతంలోని శీతల్‌నాథ్ ఆలయం సుదీర్ఘకాలం తర్వాత తెరచి.. వంసత పంచమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి పూజలు చేశారు.
స్థానికంగా ఉన్న ముస్లిముల సహకారంతోనే తాము ఆలయాన్ని తిరిగి ప్రారంభించామని భక్తులు చెబుతున్నారు. ఉగ్రవాద ప్రాబల్యం వల్ల 31 ఏళ్ల క్రితం శీతల్ నాథ్ దేవాలయాన్ని మూసివేశారు. దేవాలయం సమీపంలో ఉండే హిందువులు సైతం ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లారు.
స్థానిక ముస్లిములే ముందుకు వచ్చి దేవాలయాన్ని శుభ్రం చేసి భక్తుల ప్రవేశానికి సిద్ధం చేశారని, పూజా సామాగ్రి సమకూర్చారని ఆలయ నిర్వాహకులు చెప్పారు. భైరవ్ జయంతి ఉత్సవాలు వసంత పంచమి సందర్భంగా నిర్వహించామని వివరించారు. ఉగ్రవాదుల ప్రాబల్యం తగ్గడంతో ఆలయాన్ని 31 ఏళ్ల తర్వాత తెరిచామని తెలిపారు.
Also Read :
♦ అంత్యక్రియలకు హాజరైన 33 మందికి కరోనా.. 26 మంది విద్యార్ధులకు వాంతులు, విరేచనాలు
♦ భారతీయులకు బైడెన్ సర్కార్ శుభవార్త
♦ ఇల్లు, స్థలం.. ఏదో ఒకటి కొనడం ఎంతైనా అవసరం.. మున్ముందు..!
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com