Shiv Sena : అనర్హత ప్రొసీడింగ్స్‌పై ఉద్ధవ్‌ థాక్రే కీలక అడుగు

Shiv Sena : అనర్హత ప్రొసీడింగ్స్‌పై ఉద్ధవ్‌ థాక్రే  కీలక అడుగు
రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, ఆయన క్యాంపు ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న అనర్హత ప్రొసీడింగ్స్‌పై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరింది

మహారాష్ట్రలోని శివసేన చీలిక ఎపిసోడ్‌లో మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే వర్గం కీలక అడుగు వేసింది. రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, ఆయన క్యాంపు ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న అనర్హత ప్రొసీడింగ్స్‌పై నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టును కోరింది. షిండేతో పాటు ఇతర ఎమ్మెల్యేలపై ఉన్న అనర్హత ప్రొసీడింగ్స్‌పై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకొనేలా అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించాలని కోరారు. షిండే, ఆయన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత అంశం డిప్యూటీ స్పీకర్‌ ముందు పెండింగ్‌లో ఉండగానే షిండే చేత సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అనర్హత ప్రొసీడింగ్స్‌ పెండింగ్‌లో ఉన్న వ్యక్తితో సీఎంగా ప్రమాణస్వీకారం చేయవచ్చా? అని ప్రశ్నించింది.

శివసేన అధ్యక్షుడిగా మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే ఎన్నికయ్యారు. శివసేన జాతీయ కార్యవర్గ సమావేశంలో నేతలు షిండేను ఏకగ్రీవంగా పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. పార్టీ క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పని చేసే వారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. తద్వారా మాజీ సీఎం ఉద్ధవ్‌, ఆయనతో పాటు ఉన్న 16 మంది ఎమ్మెల్యేలకు హెచ్చరిక జారీ చేశారు. పార్లమెంట్‌ హౌస్‌లోని శివసేన ఆఫీస్‌ను షిండే వర్గానికి లోక్‌సభ సెక్రటేరియట్‌ కేటాయించింది. ఈ వర్గాన్ని అసలైన శివసేనగా గుర్తించాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన నేపథ్యంలో ఈ కేటాయింపు జరిగింది.

Tags

Read MoreRead Less
Next Story