Shivasena : సంజయ్ రౌత్ పై వేటు... శివసేన పార్లమెంట్ నాయకుడిగా గజానన్

Shivasena : సంజయ్ రౌత్ పై వేటు... శివసేన పార్లమెంట్ నాయకుడిగా  గజానన్

మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన తన పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా సంజయ్ రౌత్‌ను తొలగించింది. లోక్‌సభ ఎంపీ గజానన్ కీర్తికర్‌ను ఆయన వారసుడిగా నియమించింది. శివసేన పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా కీర్తికర్‌ను నియమించినట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ కు సీఎం షిండే లేఖ రాశారు. పార్లమెంటు భవనంలోని మూడో అంతస్తులో ఉన్న పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో శివసేన నాయకులు కీర్తికర్‌ను గురువారం సన్మానించారు.

లోక్‌సభలో ఉన్న 18 మంది శివసేన సభ్యులలో, నలుగురు ఉద్ధవ్ థాకరేతో ఉన్నారు. ఉద్దవ్ తన పార్టీని, గుర్తును కోల్పోయిన సంగతి తెలిసిందే. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలో గత సంవత్సరం శివసేన చీలిపోయింది. ఉద్దవ్ ఠాక్రే పార్టీ యొక్క ప్రధాన ఆదర్శాలతో రాజీ పడ్డారని, మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాన ప్రత్యర్థులు కాంగ్రెస్, ఎన్‌సిపితో చేతులు కలిపారని షిండే వర్గం ఆరోపించింది. ఇదిలా ఉండగా... ఎన్నికల సంఘం (EC) షిండే నేతృత్వంలోని వర్గాన్ని నిజమైన శివసేనగా గుర్తించి, పేరు, ఎన్నికల గుర్తును కేటాయించింది.

Tags

Read MoreRead Less
Next Story