Corona: భయపెడుతున్న దగ్గు, జలుబు.. ప్రతి పది మందిలో..

Corona: భయపెడుతున్న దగ్గు, జలుబు.. ప్రతి పది మందిలో..
Corona: కరోనా లక్షణాలు, సాధారణ వైరల్ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు ఒకటిగా ఉండడంతో ఏదో తెలియక తికమక పడుతున్నారు చాలా మంది..

Corona: హాచ్ అని తుమ్మితే చాలు.. అందరూ అతడి వైపు అనుమానంగా చూడాల్సిన పరిస్థితి వచ్చింది.. కరోనా మహమ్మారి లక్షణాల్లో జలుబు కూడా ఒకటి కావడంతో గొంతులో గర గర అన్నా, కాస్త దగ్గినా భయపడుతున్నారు. కరోనా లక్షణాలు, సాధారణ వైరల్ ఇన్‌ఫెక్షన్ లక్షణాలు ఒకటిగా ఉండడంతో ఏదో తెలియక తికమక పడుతున్నారు చాలా మంది.. అయితే ఈ లక్షణాలతో ఆస్పత్రికి వెళ్లిన ప్రతి పది మందిలో 8-9 మందికి కరోనాగా నిర్ధారణ అవుతోందంటున్నారు వైద్యులు.

జ్వరం లేకుండా దగ్గు, జలుబు, గొంతునొప్పి, తలనొప్పి వంటి లక్షణాలు మాత్రమే ఉన్న వారిని పరిశీలించిన 10మందిలో ఒకరిద్దరికి మాత్రమే వైరస్ బయటపడిందని వైద్యులు తెలిపారు. డెల్టా వేరియంట్‌లో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడం, రుచి, వాసన కోల్పోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తేవన్నారు. ఒమిక్రాన్‌లో ఈ లక్షణాలు ఉండడం లేదనా, అందుకే సాధారణ వైరల్ ఇన్‌ఫెక్షన్, కరోనా మధ్య కొంత గందరగోళం ఉంటోందన్నారు.

జ్వరం రెండు మూడు రోజులు మించి కొనసాగితే అప్రమత్తం కావాలంటున్నారు వైద్యులు. జ్వరం లేకుండా గొంతు నొప్పి, జలుబు, దగ్గు లాంటివి వుంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు. మాస్క్ ధరించి వైద్యుల సూచన మేరకు మందులు తీసుకోవాలి. రోజుకు రెండు మూడు సార్లు ఆవిరి పట్టాలి.

గోరు వెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు కలిపి పుక్కిలించాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే 3-4 రోజుల్లోనే లక్షణాలు తగ్గిపోతాయి. అయిదు రోజులు దాటినా జ్వరం తగ్గకపోవడం, నీరసం, ఇతర లక్షణాలు ఉంటే అప్రమత్తం కావాలి. ముఖ్యంగా సీవోపీడీ, గుండె సంబంధిత వ్యాధులు మధుమేహం, క్యాన్సర్ ఇతర దీర్ఘకాలిక సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించే చికిత్స తీసుకోవాలి.

ఆరోగ్య వంతులకు జలుబు, దగ్గు వంటి సమస్యలు వచ్చినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. టెస్టులు అవసరం లేదు. వ్యాక్సిన్ తీసుకోని వారు ఆలస్యం చేయొద్దు. వెంటనే తీసుకోవాలి. కరోనా మూడో దశ విజృంభిస్తున్న తరుణంలో ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story