భారత్‌లో హృదయవిదారక పరిస్థితులు: టెడ్రస్‌ అధానోమ్‌

భారత్‌లో హృదయవిదారక పరిస్థితులు: టెడ్రస్‌ అధానోమ్‌
భారత్ లో కరోనా కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది.

భారత్ లో కరోనా కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుతం అక్కడి పరిస్థుతులను చూస్తుంటే హృదయ విదారకంగా ఉంటుందని వ్యాఖ్యానించింది. భారత్‌కు సాయం చేసేందుకు సంస్థ కృషి చేస్తోందని తెలిపింది. అందులో భాగంగా 2,600 మంది వైద్య నిపుణుల్నీ డబ్ల్యూహెచ్‌వో భారత్ కు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రస్‌ అధానోమ్‌ సోమవారం విలేకరులతో మాట్లాడారు.

కాగా భారత్ కరోనా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16 లక్షల 58 వేల 700 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,23,144 కరోనా కేసులు బయటపడ్డాయి. ఇక కరోనాతో 2,771 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,76,36,307కి చేరింది. ఇక మరణాల సంఖ్య రెండు లక్షలలకి చేరుతుంది. అటు తాజాగా కరోనా నుంచి 2,51,827 మంది కోలుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ ని విడుదల చేసింది.

Tags

Read MoreRead Less
Next Story