థ్యాంక్యూ అంకుల్.. చిట్టి గుండెకు 'సోనూ' సాయం

థ్యాంక్యూ అంకుల్.. చిట్టి గుండెకు సోనూ సాయం
తాజాగా కృష్ణాజిల్లా తిరువూరు మండలం మునుకుళ్లకు చెందిన కొంగల వెంకటేశ్వర్లు, సరస్వతి దంపతులకు

నా గుండె మీ సాయంతో కొట్టుకుంటోంది అంకుల్.. మీ రుణం ఎలా తీర్చుకోగలను. దేవుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మరింత మందికి మీరు ఆపన్న హస్తం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిట్టి గుండెల్లో సైతం కొలువైన సోనూసూద్ సామాజిక సేవాకార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

తాజాగా కృష్ణాజిల్లా తిరువూరు మండలం మునుకుళ్లకు చెందిన కొంగల వెంకటేశ్వర్లు, సరస్వతి దంపతులకు 15 నెలల వయసున్న కుమార్తె వర్షిత గుండె సమస్యతో బాధపడుతుంది. నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో కుమార్తెకు చికిత్స చేయించలేని పరిస్థితుల్లో ఆ దంపతులు ఉన్నారు.

ఈ క్రమంలోనే దాతల సాయం తీసుకోవాలని యోచిస్తున్నారు. జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు ఎం. హరికృష్ణ, ఎల్. గంగాధర్, కె.పాపారావు, డి.సుదర్శన్, ఎం.రాంప్రదీప్ సోషల్ మీడియా ద్వారా చిన్నారి పరిస్థితిని సోనూసూద్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన తక్షణం స్పందించి చిన్నారికి ఆపరేషన్ నిమిత్తం అయ్యే ఖర్చును సమకూర్చారు.

ముంబయి ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేయడానికి అవసరమైన రూ.4.50 లక్షల సాయం అందించారు. చికిత్స అనంతరం కోలుకున్న చిన్నారి తల్లిదండ్రులతో కలిసి సోమవారం మునుకుళ్ల చేరుకుంది. తమ బిడ్డకు ప్రాణం దానం పెట్టిన సోనూసూద్‌కి చిన్నారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Tags

Next Story