Sonu Sood: పన్ను ఎగవేత ఆరోపణలపై సోనూసూద్ క్లారిటీ..

X
By - Gunnesh UV |22 Sept 2021 3:31 PM IST
తనకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు రెండు పార్టీలు ముందుకు వచ్చాయన్నారు ప్రముఖ నటుడు సోనూసూద్.
Sonu Sood: తనకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు రెండు పార్టీలు ముందుకు వచ్చాయన్నారు ప్రముఖ నటుడు సోనూసూద్. పన్ను ఎగవేత ఆరోపణలపై సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ సోదాలు చేశారు. ఈ నేపథ్యంలో తనపై వచ్చిన ఆరోపణలను సోనూసూద్ మరోసారి ఖండించారు. తాను చట్టానికి కట్టుబడి ఉండే పౌరుడినన్న ఆయన.. తనకు రాజ్యసభ సీటు ఇచ్చేందుకు రెండు పార్టీలు ముందుకు వచ్చాయని పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం రాజకీయాల్లో చేరేందుకు మానసికంగా సిద్ధంగా లేనందున వాటిని నిరాకరించినట్లు ఓ జాతీయ వార్తా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సోనూసూద్ పేర్కొన్నారు. రాజకీయాల్లోకి చేరేందుకు సిద్ధంగా ఉన్నప్పుడు తానే స్వయంగా బహిరంగంగా వెల్లడిస్తాననన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com