సుప్రీంకోర్టులో అమరావతి భూముల కేసుపై విచారణ

X
By - Gunnesh UV |22 July 2021 1:22 PM IST
Amaravati Lands: మాజీ ఏజీ దమ్మాలపాటి సహా 13 మంది భూఅక్రమాలకు పాల్పడ్డారంటూ..గతంలో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఏసీబీ
అమరావతిలో భూముల అమ్మకాలు, కొనుగోళ్లపై ఏసీబీ విచారణకు సంబంధించి హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పిటిషన్‌ను ఉపసంహరించుకుంది. ఇవాళ విచారణ సందర్భంగా ఈ విషయాన్ని తెలియచేసింది. మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ సహా 13 మంది భూఅక్రమాలకు పాల్పడ్డారంటూ గతంలో ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. దీనిపై వారు కోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చింది. ఆ తీర్పు సవాల్ చేస్తూ సుప్రీంకి వచ్చినా చివరికి పిటిషన్ ఉపసంహరించుకుంది. ఈ కేసుకు సంబంధించిన విచారణను 4 వారాల్లో పూర్తి చేయాలని హైకోర్టును సుప్రీం ఆదేశించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com