మహా సర్కారు, మాజీ హోం మంత్రి దేశ్‌ముఖ్‌కు మరో ఎదురుదెబ్బ..!

మహారాష్ట్ర సర్కారుకు, మాజీ హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. సీబీఐ దర్యాప్తు వ్యవహారంలో అనిల్ దేశ్‌ముఖ్, మహా సర్కారు వేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులపై ఆరోపిణలు వచ్చాయి. వాటిపై స్వతంత్ర దర్యాప్తు అవసరమే అని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
100 కోట్ల వసూళ్ల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్... ఆ తర్వాత తన పదవికి రాజీనామా చేశారు. ఈ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని అప్పటి ముంబయి కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ ముంబాయి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు... కేసును సీబీఐకి అప్పగించింది. 15 రోజుల్లో ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది.
అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ మహారాష్ట్ర సర్కారుతోపాటు, మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. వీటిని విచారించిన ధర్మాసనం సీబీఐ దర్యాప్తు అవసరమే అని స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com