అభిమానం హద్దులు మీరింది.. అజిత్‌కు తిక్క రేగింది.. దాంతో

అభిమానం హద్దులు మీరింది.. అజిత్‌కు తిక్క రేగింది.. దాంతో
'తలా' గా ప్రసిద్ది చెందిన కోలీవుడ్ నటుడు అజిత్ కుమార్ స్టార్ హీరో అయినా ప్రచారానికి, పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటారు. సినిమా కార్యక్రమాలకు లేదా అవార్డు ఫంక్షన్లకు కూడా హాజరుకాని వ్యక్తి.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. పెద్ద ఎత్తున ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్నారు. తమిళ హీరో అజిత్‌ తన భార్య షాలినీతో కలిసి ఓటు వేయడానికి బయల్దేరారు.

'తలా' గా ప్రసిద్ది చెందిన కోలీవుడ్ నటుడు అజిత్ కుమార్ స్టార్ హీరో అయినా ప్రచారానికి, పబ్లిసిటీకి చాలా దూరంగా ఉంటారు. సినిమా కార్యక్రమాలకు లేదా అవార్డు ఫంక్షన్లకు కూడా హాజరుకాని వ్యక్తి. అందువల్ల అభిమానులకు ఆయన కనింపిచగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. ఓటు వేయడానికి వచ్చిన్ అజిత్‌ని చూడటానికి ఫ్యాన్స్ ఎగబడ్డారు.

మంగళవారం ఉదయం 07:00 గంటలకు అజిత్ తన భార్య నటి శాలినితో కలిసి తిరువన్మియూర్‌లోని పోలింగ్ బూత్ వద్దకు వచ్చారు. ఓటు వేసిన తొలి కొలీవుడ్ ప్రముఖులలో ఆయన ఒకరు. అజిత్ ఓటు వేసిన తరువాత మాస్క్ ధరించని అభిమాని అజిత్‌తో కలిసి సెల్ఫీ తీసుకునేందుకు అతడి దగ్గరికి వచ్చాడు.

అజిత్ అతడిని గమనించేలోపు ఒకటి, రెండు ఫోటోలు క్లిక్‌మనిపించాడు. మాస్క్ ధరించలేదని గమనించిన వెంటనే అజిత్ అతడి నుంచి ఫోన్ లాక్కుని జేబులో పెట్టుకున్నారు. ప్రస్తుతం ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో ఉన్న అజిత్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగించి నెటిజన్లు తమ అభిప్రాయాలను పోస్ట్ చేస్తూ, ఈ అంశంపై చర్చిస్తున్నారు. వారిలో చాలామంది దీనిని అజిత్ మరియు ఇతర కోలీవుడ్ ప్రముఖులైన విజయ్ మరియు సూర్యల మధ్య పోలికలు తీసుకువస్తున్నారు.

కొంతమంది యూజర్లు నటులకు తమ మద్దతును అందించారు, ఎందుకంటే ప్రజలు సెలబ్రిటీలను గౌరవించాలని, వారి అనుమతి లేకుండా సెల్ఫీలు తీసుకోమని బలవంతం చేయకూడదని వారు భావించారు. తమిళనాడులోని పోలింగ్ బూత్‌లలో ఓటు వేసిన నటులు విజయ్, రజనీకాంత్, సూర్య వంటి ఇతర కోలీవుడ్ తారల ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విజయ్ చెన్నైలోని తన బూత్ కు సైకిల్ మీద వస్తున్న అతని చిత్రాలు, వీడియోలు వైరల్ అయ్యాయి.

ఏప్రిల్ 6 న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు తమిళనాడు 16 వ శాసనసభకు పోలింగ్ జరుగుతోంది. తమిళనాడులో 6.28 కోట్లకు పైగా ఓటర్లు మంగళవారం ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసిన 88,000 పోలింగ్ స్టేషన్లలో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story