Tamil Nadu : పోలీసు భద్రతతో ఆలయ ప్రవేశం చేసిన దళితులు

Tamil Nadu : పోలీసు భద్రతతో ఆలయ ప్రవేశం చేసిన దళితులు

80 ఏళ్ల తర్వాత దళితకుటుంబాలు ఆలయంలోకి ప్రవేశించాయి. తమిళనాడులోని తురువణ్ణామలైలో భారీ పోలీసు మోహరింపు మధ్య దళితులు ఆలయ ప్రవేశం చేశారు. 80 ఏళ్లుగా వీరు ఆలయ ప్రవేశ నిషేధానికి గురవుతున్నారు. అగ్రవర్ణాల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పటికీ, పోలీసు రక్షణతో తమిళనాడులోని ఆలయానికు దళితకులానికి చెందిన 300మంది పురుషులు, మహిళలు ఆలయంలోకి ప్రవేశించారు.

తిరువణ్ణామలైలోని తాండరంపట్టు వద్ద ఉన్న ముత్తు మరియమ్మన్ దేవాలయం ధర్మాదాయ మండలి పరిధిలోకి వస్తుంది. ఇక్కడ ప్రతీ సంవత్సరం పొంగల్ సందర్భంగా 12రోజుల పండుగను నిర్వహిస్తారు. గత 80 ఏళ్లుగా దళిత కుటుంబాలకు ఆలయ ప్రవేశం నిరాకరించారు. తాజాగా దళితులు ధర్మకర్తలను, గ్రామ పెద్దలను ఆలయ ప్రవేశం కల్పించవలసిందిగా కోరారు. అందుకు గ్రామపెద్దలు నిరాకరించడంతో ధర్మాదాయ శాఖ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఆదివారం పోలీసు భద్రత మధ్య దళితులకు ఆలయప్రవేశం కల్పించారు అధికారులు.

దేవాలయాలు అందరికీ చెందుతాయని ప్రభుత్వ అధికారులు చెప్పడంతో అగ్రవర్ణ సంఘాలు తమ నిరసనను వ్యక్తం చేశాయి. దాదాపు 300 మంది దళితులు ఆలయ ప్రవేశం చేసి దేవుడికి పూలమాలలు సమర్పించారు.

Tags

Read MoreRead Less
Next Story