తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఓటర్ల జాబితాలోనే కనిపించని శశికళ పేరు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఇవాళ ఒకే దశలో పూర్తిగా ఎన్నికలు జరుగుతున్నాయి. బెంగాల్, అసోంలో మూడో విడత పోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా తమిళనాడులో ఈసారి గెలుపు ఎవరిది అన్నది హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. రాజకీయ దిగ్గజాలు జయలలిత, కరుణానిధి లేకుండా తమిళనాడులో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి.
జయలలిత నెచ్చెలి శశికళ పేరు ఓటర్ల జాబితాలోనే కనిపించలేదు. చెన్నై థౌజండ్ లైట్ నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో శశికళ పేరు నమోదై ఉండేది. కాని, ఈసారి జాబితాలో ఆమె పేరే లేదు.
మళ్లీ అధికారంలోకి రావాలనే కసితో అన్నాడీఎంకే ప్రచారం చేసింది. బీజేపీ అగ్రనేతలు కూడా తమిళనాడులో ప్రచారం నిర్వహించారు. అటు డీఎంకే కూడా గట్టిగానే ప్రచారం చేసింది. పదేళ్లు అన్నాడీఎంకే పాలన చూసిన తమిళులు.. ఈసారి డీఎంకేనే ఆదరిస్తారని ఆ పార్టీ ధీమాగా చెబుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com