ప్లీజ్.. పెళ్లికి రావొద్దు: మాజీ ఎమ్మెల్యే స్పెషల్ ఇన్విటేషన్

ప్లీజ్.. పెళ్లికి రావొద్దు: మాజీ ఎమ్మెల్యే స్పెషల్ ఇన్విటేషన్
X
అందుకే కామ్‌గా మమ అనిపిస్తూ వధూవరులకు నాలుగు అక్షింతలు వేసి పెళ్లయిందనిపిస్తున్నారు చాలా మంది.

మహమ్మారి కరోనా మన ఆనందాలన్నీ హరించి వేస్తోంది. ఒకప్పుడు పెళ్లంటే వందల మంది అతిధులతో కళ్యాణ మండపం కళకళలాడుతు ఉండేది. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటేనే భయపడే రోజు వచ్చింది. అతిధుల్ని ఆహ్వానిస్తే ఎవరి ఏం ఉందో తెలియదు.. అందుకే కామ్‌గా మమ అనిపిస్తూ వధూవరులకు నాలుగు అక్షింతలు వేసి పెళ్లయిందనిపిస్తున్నారు చాలా మంది.

తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు. తన కుమార్తె వివాహాన్ని కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య మాత్రమే నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జనవరి 2న తన కుమార్తె సాయి నవ్యశ్రీ వివాహానికి ఎవరూ రావొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. కరోనా నిబంధనలే తనను కట్టడి చేశాయని, అన్యదా భావించవద్దని.. ఆహ్వాన పత్రికతో పాటు అందించిన స్వీట్ బాక్సు వెనుక ఈ సందేశాన్ని ముద్రించారు.

వచ్చే నెల 2న తన కుమార్తె సాయి నవ్య శ్రీ వివాహానికి పెద్ధలు సుమూహుర్తం నిశ్చయించారు. ఈ విన్నపాన్ని సహృదయంతో అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నానని రాసుకొచ్చారు. అతిధులు వారి వారి ఇళ్ల నుంచే నూతన వధూవరులకు శుభాశీస్సులు అందించవలసిందిగా కోరుకుంటున్నానని అందులో తెలిపారు. ఈ వివాహ శుభ సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలోని ప్రజలకు స్పెషల్ గిప్ట్ అందజేస్తున్నారు. మొత్తం లక్ష స్వీట్ బాక్సులు పంపిణీ చేస్తున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Tags

Next Story