KCR _ Uddhav Thackeray : ఉద్ధవ్ థాక్రేతో ముగిసిన సీఎం కేసీఆర్ చర్చలు

KCR _ Uddhav Thackeray : కేంద్రంలో బీజేపీ వ్యతిరేక కూటమి లక్ష్యంగా మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో చర్చలు జరిపారు సీఎం కేసీఆర్. ప్రస్తుత రాజకీయాలు, కేంద్రంలో మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. స్టాలిన్ సహా ఇతర ముఖ్యమంత్రులతో జరిపిన చర్చల సారాంశాన్ని థాక్రేకు వివరించారు కేసీఆర్. ఈ సమావేశంలో ఎంపీలు రంజిత్ రెడ్డి, సంతోష్ కుమార్, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి, నటుడు ప్రకాష్ రాజ్ పాల్గొన్నారు. అంతకుముందు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రేతో కలిసి లంచ్ చేశారు సీఎం కేసీఆర్. కాసేపట్లో సిల్వర్ ఓక్ ఎస్టేట్‌కు వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. అక్కడ ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తో భేటీ అవుతారు. దేశంలో రాజకీయ పరిస్థితులు, బీజేపీ సర్కార్ విధానాలు ఇరువురు నేతలు చర్చిస్తారు. రాత్రి ఏడున్నర గంటలకు హైదరాబాద్ తిరుగుపయనమవుతారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com