ప్లాస్మా థెరపీతో పెద్దగా మార్పేమీ లేదు.. ఓ స్టీడీలో వెల్లడి

ప్లాస్మా థెరపీతో పెద్దగా మార్పేమీ లేదు.. ఓ స్టీడీలో వెల్లడి
కరోనా రోగులుకు ప్లాస్మా థెరపీ చేయడం ద్వారా మరణాల రేటుని గానీ, కరోనా లక్షణాల తీవ్రతను కూడా తగ్గించలేమని ఓ అధ్యాయనంలో

కరోనా రోగులుకు ప్లాస్మా థెరపీ చేయడం ద్వారా మరణాల రేటుని గానీ, కరోనా లక్షణాల తీవ్రతను కూడా తగ్గించలేమని ఓ అధ్యాయనంలో తేలింది. ఐసీఎంఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ స్టడీలో ఈ విషయం వెల్లడైంది. కరోనా రోగులపై ప్లాస్మా చికిత్స ద్వారా ప్లేసిడ్ ట్ర‌య‌ల్ నిర్వహించారు. మొత్తం 39 ప‌బ్లిక్‌, ప్రైవేటు హాస్పిటల్ల‌లో ఏప్రిల్ 22 నుంచి జూలై 14వ తేదీ మ‌ధ్య ఈ అధ్య‌య‌నం చేప‌ట్టారు. స్వ‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న 464 మందిపై ఈ ప్రయోగం చేశారు. 464 మందిలో 235 మందికి ఉత్త‌మ ప్ర‌మాణం ద్వారా.. మ‌రో 229 మంది సాధార‌ణ ప్ర‌మాణాల ప్ర‌కారం ప్లాస్మా ఇచ్చారు. అయితే, ఫలితాలు పరిశీలిస్తే.. 28 రోజుల త‌ర్వాత కూడా మ‌ర‌ణాల రేటులో కానీ, వ్యాధి తీవ్రతలో కానీ ఎలాంటి మార్పు కనిపించలేదు.

Tags

Next Story