Tamil Nadu: ఆలయ రథోత్సవంలో విషాదం.. 11 మంది మృతి

Tamil Nadu: బుధవారం తెల్లవారుజామున సమీపంలోని కలిమేడు వద్ద అప్పర్ ఆలయ రథోత్సవం జరుగుతుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
తమిళనాడు తంజావూరు జిల్లాలో ఆలయ రథోత్సవం సందర్భంగా హైటెన్షన్ ట్రాన్స్‌మిషన్ లైన్ తాకడంతో ఇద్దరు చిన్నారులు సహా 11 మంది విద్యుదాఘాతానికి గురై మృతి చెందగా, పలువురు గాయపడినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. బుధవారం తెల్లవారుజామున సమీపంలోని కలిమేడు వద్ద అప్పర్ ఆలయ రథోత్సవం జరుగుతుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను తంజావూరు వైద్య కళాశాలలో చేర్పించారు. తమిళనాడులో జరిగే వార్షిక రథోత్సవంలో భాగంగా ఈ ఊరేగింపు జరిగింది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ ఘటనపై సంతాపం వ్యక్తం చేస్తూ, తంజావూరు విద్యుదాఘాత ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమిళనాడులోని తంజావూరులో జరిగిన దుర్ఘటనతో ప్రధాన మంత్రి ట్విట్టర్‌లో ఇలా రాశారు.
"ఈ దుఃఖ సమయంలో నా ఆలోచనలు మృతుల కుటుంబాలతో ఉన్నాయి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను.'' తమిళనాడులోని తంజావూరులో జరిగిన దుర్ఘటన కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు PMNRF నుండి ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేలు అందజేయనున్నారు.
Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the mishap in Thanjavur, Tamil Nadu. The injured would be given Rs. 50,000: PM @narendramodi
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com