Narendra Modi : గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధికి ఆటంకం : మోదీ

Narendra Modi : గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధికి ఆటంకం : మోదీ
Narendra Modi : త్వరలో ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రాలపై ప్రధాని మోదీ ప్రత్యేక ఫోకస్ పెట్టారు.

Narendra Modi : త్వరలో ఎన్నికలు జరగనున్న ఈశాన్య రాష్ట్రాలపై ప్రధాని మోదీ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఒకేరోజు మణిపూర్, త్రిపుర రాష్ట్రాల్లో మోదీ పర్యటించారు. తొలుత ఇంపాల్‌ చేరుకుని 4 వేల 815 కోట్లు విలువ చేసే పలు అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అనంతరం 13 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. బీజేపీ హయాంలో మణిపూర్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని మోదీ అన్నారు. త్వరలో ప్రతి ఇంటికి తాగునీటిని అందిస్తామని తెలిపారు. డోంట్ లుక్ ఈస్ట్ అనే పాలసీతో గత ప్రభుత్వాలు మణిపూర్ పట్ల నిర్లక్ష్యం చూపాయని ఆరోపించారు. 2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక మణిపూర్ అభివృద్ధి కోసం యాక్ట్ ఈస్ట్ పాలసీ తీసుకున్నామని ప్రధాని మోదీ తెలిపారు.

మణిపూర్ తర్వాత త్రిపుర రాజధాని అగర్తలాలో ప్రధాని మోదీ పర్యటించారు. మహారాజా వీర్ విక్రమ్ ఎయిర్‌పోర్టులో 3 వేల 400 కోట్ల వ్యయంతో కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. త్రిపుర గ్రామ్​ సమృద్ధి యోజన, విద్యాజ్యోతి స్కూల్స్​ ప్రాజెక్ట్​ మిషన్ హండ్రెడ్ వంటి కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం అధికారులతో కలిసి అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. గత ప్రభుత్వాలు త్రిపుర రాష్ట్రాభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ హయాంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఈశాన్యానికి త్రిపుర గేట్​వే అవుతుందని ప్రధాని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story