Twitter : భారత్ కు ట్విట్టర్ రూ.110 కోట్ల సాయం

X
By - TV5 Digital Team |11 May 2021 11:51 AM IST
దేశంలో కోవిడ్-19ను ఎదుర్కొనేందుకుగాను పాటుపడుతున్న మూడు ఎన్జీవో సంస్థలకు ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు ట్విట్టర్ సీఈఓ జాక్ పాట్రిక్ డోర్సే తెలిపారు.
భారత్ లో కరోనా కట్టడి చర్యలకు ట్విట్టర్ సుమారు రూ.110 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. దేశంలో కోవిడ్-19ను ఎదుర్కొనేందుకుగాను పాటుపడుతున్న మూడు ఎన్జీవో సంస్థలకు ఈ విరాళాన్ని అందిస్తున్నట్లు ట్విట్టర్ సీఈఓ జాక్ పాట్రిక్ డోర్సే తెలిపారు. ఆక్సిజన్, పీపీ ఈ కిట్స్, మందుల కొనుగోలుకు కేర్, ఎయిడ్ ఇండియా, సేవా ఇంటర్నేషనల్ యూఎస్ఏ అనే మూడు ప్రభుత్వేతర సంస్థలకు విరాళంగా ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో కేర్ ఎన్జీవోకు 10 మిలియన్ డాలర్లు కేటాయించగా.. మిగతా రెండు సంస్థలకు 2.5 మిలియన్ డాలర్ల చొప్పున విరాళమిచ్చారు.
$15 million split between @CARE, @AIDINDIA, and @sewausa to help address the COVID-19 crisis in India. All tracked here: https://t.co/Db2YJiwcqc 🇮🇳
— jack (@jack) May 10, 2021
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com