కర్నాటకలో కేంద్ర మంత్రి కారు బోల్తా!

కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. కేంద్ర రక్షణ, ఆయుష్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన భార్య విజయ, వ్యక్తిగత కార్యదర్శి దీపక్‌లు స్పాట్‌లోనే మృతి చెందారు.
Ayush Minister Shripad Naik has met with an accident near Ankola in Uttara Kannada dist of Karnataka. Driver lost control over the car. Minister is said to very critical but unfortunately his wife died on the spot @ABPNews @abpmajhatv pic.twitter.com/p4W0FzD2UW
— Ganesh Thakur (@7_ganesh) January 11, 2021
శ్రీపాద్ నాయక్ ప్రయాణిస్తున్న కారు కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా అంకుల సమీపంలో బోల్తాపడింది. ఎల్లాపూర్ నుంచి గోకర్ణ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. మెరుగైన వైద్యం కోసం కేంద్రమంత్రిని గోవాలోని బంబోలి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స అందేలా చూడాలని గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ను ప్రధాని మోదీ కోరారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సీఎం సావంత్‌తో ఫోన్లో మాట్లాడారు.
Karnataka: Union Minister Shripad Naik & his wife injured after his car met with an accident near a village in Ankola Taluk of Uttara Kannada dist. They were enroute Gokarna from Yellapur when the incident took place. They've been admitted to a hospital. A Police case registered. pic.twitter.com/ABMdx9ewoC
— ANI (@ANI) January 11, 2021
ముఖ్యమంత్రి సావంత్ ఆస్పత్రికి వెళ్లి శ్రీపాద్ నాయక్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. శ్రీపాద్ నాయక్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని, ఆయనకు ప్రాణాపాయం లేదని గోవా సీఎం పేర్కొన్నారు. ఆయనను ఢిల్లీ తరలించాల్సిన అవసరం లేదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com