India - Pakistan : భార్య పై కేసు పెట్టిన భర్త.. పాక్ గెలవడమే కారణం..!

India - Pakistan : భార్య పై కేసు పెట్టిన భర్త.. పాక్ గెలవడమే కారణం..!
India - Pakistan : పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్.. టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా గత నెల 24న ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

India - Pakistan : పచ్చని కాపురంలో చిచ్చు పెట్టింది ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్.. టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా గత నెల 24న ఇరుజట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌‌లో భారత్ పైన పాక్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈక్రమంలో ఓ ఇల్లాలు చేసిన పని ఆమె కాపురాన్ని కూల్చింది. సదరు ఇల్లాలు పాక్ మద్దతు తెలిపింది.. అంతేకాదు.. పాక్ గెలవడంతో దానిని సెలబ్రేట్ కూడా చేసుకుంది. ఇదంతా చూసిన ఆమె భర్త.. తన భార్య పైన, ఆమె తల్లిదండ్రుల పైన పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. ఇక వివరాల్లోకి వెళ్తే... ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది.



షంగన్‌ఖేడాకు చెందిన ఇషాన్ మియా, రబియా షంషీ ఇద్దరు భార్యాభర్తలు.. ఇద్దరు ప్రస్తుతం విడివిడిగా ఉంటున్నారు. రబియా షంషీ తన కుటుబంతో కలిసి నివసిస్తోంది.. అయితే అక్టోబర్ 24న జరిగిన మ్యాచ్ లో పాక్ గెలవడంతో రబియా, ఆమె కుటుంబ సభ్యులు టపాసులు కాలుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. అంతేకాకుండా దీనిని వాట్సాప్‌‌లో షేర్ చేసుకున్నారు. ఇది చూసిన రబియా భర్త ఇషాన్ కి చిర్రెత్తుకొచ్చింది. భార్య రబియా షంషీ, ఆమె కుటుంబ సభ్యులపైన కేసు నమోదు చేశారు. కాగా గతంలో రబియా ఇషాన్ పైన వరకట్న వేధింపులు కింద కేసు పెట్టింది.

అటు భారత ఓటమిని సెలబ్రేట్‌ చేసుకున్న వారిపై దేశద్రోహం కేసులు నమోదు చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో పోలీసులు కూడా పలువురి పైన కేసులు నమోదు చేశారు.


Tags

Next Story