Venkaiah Naidu : సేవే అసలైన మతమని నమ్ముతా..!

Venkaiah Naidu :  సేవే అసలైన మతమని నమ్ముతా..!
Venkaiah Naidu : సేవే అసలైన మతమని ప్రగాఢంగా నమ్ముతామన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

Venkaiah Naidu : సేవే అసలైన మతమని ప్రగాఢంగా నమ్ముతామన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. దేవాలయానికి వెళ్తే ఎంత పుణ్యమో సేవాలయానికి వెళ్తే అంతే పుణ్యమన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణభారత్ ట్రస్టు 20వ వార్షికోత్సవంలో వెంకయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉపరాష్ట్రపతి...రైతులపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. గ్రామీణ యువతే దేశానికి ఆశాకిరణాలన్నారు. యువతకు శిక్షణ ఇచ్చి సొంత కాళ్లపై నిలబడేలా చేయాలన్నారు. మహిళలు ఇంకా అనేక రంగాల్లో ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. తెలుగు భాష పరిరక్షణకు స్వర్ణభారత్ ట్రస్టు కృషి చేస్తోందన్నారు. మాతృభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

Tags

Next Story