ఉపరాష్ట్రపతిగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న వెంకయ్యనాయుడు..!

ఉపరాష్ట్రపతిగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న వెంకయ్యనాయుడు..!
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు నాలుగో ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ-బుక్ విడుదల చేసింది ఉపరాష్ట్రపతి కార్యాలయం.

ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు నాలుగో ఏడాది పదవీకాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ-బుక్ విడుదల చేసింది ఉపరాష్ట్రపతి కార్యాలయం. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేపట్టిన, హాజరైన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఫ్లిప్ బుక్‌ విడుదల చేశారు. వివిధ భారతీయ భాషల్లో విడుదలైన ఈ ఈ-బుక్‌లో గతేడాది పది రాష్ట్రాల్లో, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉపరాష్ట్రపతి పాల్గొన్న 133 కార్యక్రమాల వివరాలను సంక్షిప్తంగా వివరించారు. గతేడాది ఉపరాష్ట్రపతి 53 ప్రసంగాలు ఇవ్వగా, 23 పుస్తకాలను ఆవిష్కరించారు. 21కి పైగా విద్య, విజ్ఞాన, వ్యవసాయ సంస్థలను సందర్శించడంతోపాటు 7 స్నాతకోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మూడు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతోపాటు 4 అవార్డు ప్రదాన కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు.

Tags

Next Story