Venkaiah Naidu : యూఏఈ వెళ్ళనున్న భారత ఉపరాష్ట్రపతి

Venkaiah Naidu  : యూఏఈ వెళ్ళనున్న భారత ఉపరాష్ట్రపతి
X
Venkaiah Naidu : షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హయాంలో భారత్-యూఏఈ సంబంధాలు బాగా వృద్ధి చెందాయని మంత్రిత్వ శాఖ ప్రకటన పేర్కొంది.

యూఏఈ: షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ మృతిపై యూఏఈ నాయకులకు సంతాపం తెలియజేసేందుకు భారత ప్రభుత్వం తరపున మే 15న యూఏఈ విచ్చేయనున్నారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఉపరాష్ట్రపతి పర్యటనను ధృవీకరిస్తూ భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ నేడు ప్రకటన విడుదల చేసింది.

శనివారం అనగా మే 14న భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ న్యూఢిల్లీలోని యూఏఈ ఎంబసీని సందర్శించి భారత తరపున సంతాపాన్ని తెలియజేశారు. షేక్ ఖలీఫా మృతికి సంతాప సూచికంగా భారత్ కూడా మే 14న జాతీయ సంతాప దినంగా ప్రకటించింది. ఇక, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.

షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హయాంలో భారత్-యూఏఈ సంబంధాలు బాగా వృద్ధి చెందాయని మంత్రిత్వ శాఖ ప్రకటన పేర్కొంది.

Tags

Next Story