Weather: రానున్న రోజుల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు..!!

Weather: రానున్న రోజుల్లో అసాధారణ ఉష్ణోగ్రతలు..!!
X
తూర్పు, మధ్య, వాయవ్య భారత్‌లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం

రానున్న రోజుల్లో ఎండలు మండిపోనున్నాయి. దేశంలో చాలాచోట్ల ఏప్రిల్‌ నుంచి జూన్‌ నెలల మధ్య అసాధారణ ఉష్ణోగ్రతలు నమోదవనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మధ్యకాలంలో తూర్పు, మధ్య, వాయవ్య భారత్‌లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని తెలిపింది. ముఖ్యంగా బిహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, పంజాబ్‌, హర్యానా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి వేడిగాలులు వీచే అవకాశం ఉందని ఐఎండి తెలిపింది. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల వర్షాలు కురిసినా.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. రాత్రి సమయాల్లో వాతావరణం కాస్త చల్లగా ఉంటుండగా మధ్యాహ్న సమయాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి.

Tags

Next Story