married on airplane: విమానంలో వివాహ వేడుక.. 130 మంది అతిధులు హాజరు

married on airplane: ఆకాశవీధిలో అందాల జంట మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. తమిళనాడు మధురై తూత్తుకుడికి చెందిన ఇద్దరు వ్యాపార వేత్తలకు చెందిన సంతానం. ఇందుకోసం చార్టర్డ్ ఫ్లైట్ ను అద్దెకు తీసుకున్నారు. బంధువర్గానికి చెందిన 130 మంది అతిధులకు కూడా ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. వారందరి సమక్షంలో వరుడు.. వధువు మెడలో తాళి కట్టాడు.
కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో, మధురైకి చెందిన రాకేశ్, ధీక్షణ చార్టర్డ్ ఫ్లైట్ లో వివాహం చేసుకున్నారు.
రాష్ట్రంలో కరోనావైరస్ కేసుల సంఖ్య పెరగడంతో శనివారం తమిళనాడు ప్రభుత్వం కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను మరో వారం అంటే మే 31 వరకు పొడిగించింది.
పూర్తి లాక్డౌన్ ముందు, రాష్ట్ర ప్రభుత్వం ఒక రోజు సడలింపుకు అనుమతిచ్చింది. వారాంతంలో రాత్రి 9 గంటల వరకు అన్ని షాపులను ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది.
వాస్తవానికి, రాకేశ్ మరియు ధీక్షణ గత వారం ఇరుకుటుంబాల సమక్షంలో వివాహం చేసుకున్నారు. కానీ లాక్టౌన్ ఒకరోజు సడలించిన వెంటనే, వారిద్దరూ తమ ప్రత్యేక దినాన్ని గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకున్నారు. అందుకోసం 'ఎయిర్ క్రాప్ట్ వెడ్డింగ్' ప్లాన్ చేశారు.
మొత్తం 130 మంది ప్రయాణికులు తమ బంధువులు అని వారందరికీ ఆర్టీ-పిసిఆర్ పరీక్ష చేసి నెగెటివ్ అని రిపోర్ట్ వచ్చిన తరువాతే విమానంలో ఎక్కించారు.
శుక్రవారం రాష్ట్రంలో 36,000 కరోనావైరస్ కేసులు నమోదవడంతో లాక్డౌన్ పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం, ప్రైవేట్ సంస్థ ఉద్యోగులందరూ ఇంటి నుండి పని చేయమని కోరారు. లాక్డౌన్ సమయంలో అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు మాత్రమే రాష్ట్రంలో పనిచేస్తాయి.
ఫార్మసీలు, పాల దుకాణాలు, వార్తాపత్రిక సేవలు మాత్రమే రాష్ట్రంలో పనిచేస్తాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com