ప్రియుడి కోసం గంట పాటు ఈత కొట్టి.. బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు చేరిన మహిళ

ప్రియుడి కోసం గంట పాటు ఈత కొట్టి.. బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు చేరిన మహిళ
ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌య‌మైన ఓ ప్రియుడి కోసం ఓ యువతి పెద్ద సాహసమే చేసింది.. అతన్ని పెళ్ళాడడం కోసం నీటి ప్రవాహాన్ని కూడా లెక్క చేయలేదు..

ఫేస్‌బుక్‌లో ప‌రిచ‌య‌మైన ఓ ప్రియుడి కోసం ఓ యువతి పెద్ద సాహసమే చేసింది.. అతన్ని పెళ్ళాడడం కోసం నీటి ప్రవాహాన్ని కూడా లెక్క చేయలేదు.. గంట పాటు ఈత కొట్టి మరి ప్రియుడిని చేరుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఆరు నెలల క్రితం భార‌త్‌కు చెందిన అభిక్ మండ‌ల్‌ బంగ్లాదేశ్ మ‌హిళ కృష్ణా మండ‌ల్‌ కు ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది.. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

అయితే ప్రియుడి దగ్గరికి రావడానికి ఆమె దగ్గర పాస్‌పోర్టు, వీసా లేదు.. దీనితో బంగ్లాదేశ్‌లోని రాయ‌ల్ బెంగాల్ టైగ‌ర్స్‌కు పేరొందిన సుంద‌ర్‌బ‌న్స్‌లో ప్ర‌వేశించింది. ఆపై గంట‌పాటు న‌దిలో ఈదుతూ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాల్లోకి ప్రవేశించాలని యువతి ప్లాన్ చేసింది. అలా నదిని గంటపాటు ఈదుకుంటూ బెంగాల్ లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలోని కైఖలిలోకి ప్రవేశించింది.

ఆ తర్వాత అక్కడి నుంచి ఆమెను ప్రియుడు తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు.. అయితే ఈ విషయం పోలీసులకి తెలియడంతో అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. బంగ్లాదేశ్ హై క‌మిష‌న్‌కు కృష్ణ‌ను అధికారులు అప్పగిస్తార‌ని స‌మాచారం.

Tags

Next Story