ప్రపంచవ్యాప్తంగా పదిలక్షలకు చేరువలో కరోనా మరణాలు

ప్రపంచవ్యాప్తంగా పదిలక్షలకు చేరువలో కరోనా మరణాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభన కొనసాగుతుంది. ప్రపంచం మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3.24 కోట్లను దాటింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభన కొనసాగుతుంది. ప్రపంచం మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3.24 కోట్లను దాటింది. అటు, మృతుల సంఖ్య 9.88 లక్షలకు చేరువైంది. ఇప్పటివరకూ కరోనా నుంచి 2.39 కోట్ల మంది కోలుకున్నారు. అయితే, కెనడా, బ్రిటన్‌లలో కరోనా రెండో దశ ప్రారంభమయ్యింది. కాని, కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో మాత్రం తమ దేశంలో సెకెంట్ వేవ్ వార్తలను ఖండిస్తున్నారు. కెనడాలో కొత్తగా 1300 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.50 లక్షలకు చేరింది. బ్రిటన్‌లో కొత్తగా 6,634 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు ఇంత మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దీంతో బ్రిటన్ లో ఆందోళన మొదలైంది.

Tags

Read MoreRead Less
Next Story