యాదాద్రి ఆలయం.. విమాన గోపురానికి 60 కేజీల బంగారు తాపడం..

యాదాద్రి ఆలయం.. విమాన గోపురానికి 60 కేజీల బంగారు తాపడం..
అయితే ఈ బంగారాన్ని దాతల నుంచి సేకరించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొత్త శోభ సంతరించుకుంది. ఆలయ గోపురానికి మరికొన్ని హంగులు అద్దుతున్నారు నిర్వాహకులు. ఇందులో భాగంగానే గర్భాలయంపై 45 అడుగుల ఎత్తుతో నిర్మించిన విమాన గోపురానికి బంగారు తాపడం చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 60 కేజీల బంగారం అవసరం అవుతుందని అంచనా వేస్తున్నారు. అయితే ఈ బంగారాన్ని దాతల నుంచి సేకరించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.

మరోవైపు ఉత్సవ మూర్తుల విగ్రహాలను ఊరేగించే రధానికి పసిడి తొడుగుల పని పూర్తయింది. ఈనెలాఖరు లోపం రథం యాదాద్రికి చేరుకుంటుందని ఆలయ ఈవో గీత తెలిపారు. కాగా స్వర్ణ రథం తయారీ ఖర్చు రూ.60 లక్షలను శ్రీలోగిళ్లు, ల్యాండ్‌మార్క్ రియల్ ఎస్టేట్ సంస్థల అధినేతలు సురేశ్ రెడ్డి, రవీందర్ రెడ్డి భరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story