గుడ్ న్యూస్... త్వరలో అందుబాటులోకి మరో టీకా..!

భారత్ లో కరోనా విజృంభిస్తున్న వేళ.. మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన జైడస్ క్యాడిలా సంస్థ 'జైకోవ్-డి' టీకా తయారు చేసింది. దీనికి అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని DCGIకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం కూడా ఈ నెలలో ఆమోదముద్ర వేయనుందట. ఇదే జరిగితే దేశంలో అందుబాటులోకి రానున్న నాలుగో టీకా కానుంది.
ఇది మూడు డోసుల్లో లభిస్తుంది. తమ కంపెనీ కోవిడ్ వ్యాక్సిన్ జైకోవ్-డి భారతదేశంలో ఆమోదం పొందే సమయం చాలా దగ్గరలోనే ఉందని జైడస్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ షార్విల్ పటేల్ తెలిపారు. రెగ్యులేటరీ అనుమతులు లభిస్తే, జూలై నుంచే వ్యాక్సిన్ల ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. కాగా ఇప్పటికే దేశంలో కోవీషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్-వి అనే మూడు కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com