Pakistan Karachi Murder: ప్రియుడిని ముక్కలు ముక్కలుగా నరికిన మహిళ.. ఆ తర్వాత అతడి శవంతోనే..

Pakistan Karachi Murder: కోపంతో మనుషులు ఎంత దారుణానికి అయినా ఒడిగడతారు అన్న మాటకు మనం ఇప్పటివరకు ఎన్నో ఉదాహరణాలు చూశాం. అంతే కాకుండా చిన్న చిన్న విషయాలకే గొడవలు పడడం, అవి హత్యలకు దారితీయడం లాంటి ఘటనలను కూడా మనం తరచుగా చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఓ దారుణమైన ఘటనే పాకిస్థాన్‌లోని కరాచీలో చోటుచేసుకుంది.
పాకిస్థాన్ కరాచీలోని సద్దార్ ప్రాంతంలో ఓ 45 ఏళ్ల మహిళ, 70 ఏళ్ల మహ్మద్ సొహెయిల్‌తో గత కొంతకాలంగా కలిసి జీవిస్తున్నారు. అయితే తరచుగా వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఇటీవల అలాంటి ఓ గొడవలో మహిళకు పట్టరానంత కోపం వచ్చింది. అంతే.. మహ్మద్ సొహెయిల్‌ను హత్య చేయాలని నిర్ణయించుకుంది.
మహ్మద్ సొహెయిల్‌ను ముక్కలుముక్కలుగా నరికింది. అనంతరం ఆ మృతదేహం పక్కనే నిద్రించింది. వారు ఉండే అపార్ట్‌మెంట్ బయట ఓ మనిషి చేతి భాగాలు పడి ఉన్నాయని పోలీసులకు సమాచారమిచ్చారు స్థానికులు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అపార్ట్‌మెంట్ తలుపులు తెరిచి చూడగా.. అక్కడ ఓ మనిషి శరీర భాగాలను, వాటి పక్కనే నిద్రిస్తు్న్న మహిళను చూసి షాక్ అయ్యారు.
సొహెయిల్‌ను నరికిన కత్తి కూడా అక్కడే లభించడంతో మహిళే నిందితురాలని పోలీసులు భావిస్తు్న్నారు. ఇదే విషయంపై తనను ప్రశ్నించగా మహిళ పొంతనలేని సమాధానాలు చెప్తోందని వారు తెలిపారు. మహిళ స్థితి చూస్తుంటే తాను డ్రగ్స్ తీసుకొని ఉండవచ్చని వారు అనుమానిస్తు్న్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com