Manama: బహ్రెయిన్-భారత్ దౌత్య సంబంధాలను పరిచయం చేసే డాక్యూమెంటరీ విడుదల..

Manama: బహ్రెయిన్-భారత్ దౌత్య సంబంధాలను పరిచయం చేసే డాక్యూమెంటరీ విడుదల..
X
Manama: బహ్రెయిన్-భారత్ దౌత్య సంబంధాలు 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఒక డాక్యుమెంటరీ తీశారు.

Manama: బహ్రెయిన్ మరియు భారతదేశం దౌత్య సంబంధాలు 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా వివిధ అంశాలను వివరిస్తూ ఒక డాక్యుమెంటరీ తీశారు. బహ్రెయిన్ లోని నవభారత్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన 'గోల్డెన్ గ్లిమ్ప్స్' కార్యక్రమంలో ఈ డాక్యూమెంటరీని విడుదల చేశారు. ట్రేడ్, కామర్స్, ఎడ్యుకేషన్, ఆరోగ్యం, నిర్మాణ మరియు పర్యాటక రంగం వంటి వివిధ రంగాలలో 50 సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య జరిగిన అభివృద్ధి అంశాలపై ఈ డాక్యుమెంటరీ తీశారు.

'గోల్డెన్ గ్లిమ్ప్స్' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బహ్రెయిన్ భారత రాయబారి పీయూష్ శ్రీవాత్సవ విచ్చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు, బహ్రెయిన్ లోని పలు కంపెనీల అధిపతులు పాల్గొన్నారు. "ఇరు దేశాల సంస్కృతీ, వ్యాపార రంగాల అభివృద్ధి కళ్ళకు కట్టినట్టుగా తీసిన ఈ డాక్యుమెంటరీ వచ్చే తరాలకు కూడా దిక్సూచిగా ఉంటుంది" అని భారత రాయబారి ఆశాభావం వ్యక్తం చేశారు.

నవభారత్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ పి.వి రెడ్డి మాట్లాడుతూ "మేము చేసిన ఈ చిరు ప్రయత్నం బహ్రెయిన్ లోని ప్రవాసీయుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని తీసినది. ఈ కార్యక్రమంలో మాకు సహాయసహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు" అని అన్నారు. నవభారత్ సంస్థ అధ్యక్షులు డాక్టర్ పి.వి రెడ్డి, జనరల్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ మరియు కార్యవర్గ సభ్యులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

Tags

Next Story