California: కాలిఫోర్నియాలో ఆగని కార్చిచ్చు.. 21వేల హెక్టార్లలో అడవులు దగ్ధం..
By - Divya Reddy |1 Aug 2022 4:30 PM GMT
California: కాలిఫోర్నియాలో కార్చిచ్చు రగులుతోంది. వందల సంఖ్యలో సిబ్బంది ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
California: అమెరికాలోని కాలిఫోర్నియాలో కార్చిచ్చు రగులుతోంది. వందల సంఖ్యలో అగ్నిమాపక సిబ్బంది ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. మొన్న ఉత్తర సిస్కియో కౌంటీలో అగ్ని రాజుకుంది. అది ఇప్పటికే ఆ ప్రాంతంలోని 21 వేల హెక్టార్లలో అడువులను దగ్ధం చేసింది. పసిఫిక్ క్రెస్ట్ ప్రాంతంలో ఉన్న సుమారు రెండు వేల మంది ఆ ప్రాంతాన్ని వీడిచివెళ్లిపోయారు. ప్రస్తుతం కాలిఫోర్నియాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రమాదకార స్థాయిలో కార్చిచ్చు ఉన్నట్లు హెచ్చరించారు. సిస్కియో కౌంటీలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ ఏడాది ఇదే అతిపెద్ద కార్చిచ్చు ఘటన అని అధికారులు తెలిపారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com